Thursday, July 16, 2009

గాయత్రి1


ఓమ్ భూర్భువస్సువః ఓమ్ తత్సవితు ర్వరేణ్యం
భర్గో దేవస్య థీమహి థియో యో నః ప్రచోదయాత్


గాయత్ర్యా: పరంమంత్రం నమాతు: పరదైవతమ్ - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. "గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించెను. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము.'త్రాయతే' అనగారక్షించడం. కనుక ప్రాణములను రక్షించునది గాయత్రి.

గాయత్రి చేయని వాడు రోజు వాని ప్రవర్తన అంతా పశు ప్రవర్తన అనే భావించండి. భారతీయుడైపుట్టి గాయత్రి చేయని వాడు పశువుతో సమానముఅని పెద్దలు అంటారు. పశువు అనగా పాశముచే బంధింప బడినది అని అర్దము. అందరమూ కూడా ఏదో ఒక విషయంలో బంధింపబడి ఉన్న వారిమే.జీవుడు కూడా పశువు వలే ఒక గుంజకు బంధింపబడి వున్నాడు అని మన సనాతన గ్రంధాలు తెలియ జేస్తున్నాయి. గుంజే మన వెన్నెముక.సాధారణంగా మనము అనుకునే పశువుకు తన ప్రవర్తన తనకు తెలియదు. విచక్షణ, బుద్ది లేక వుంటుంది. మనిషికి జంతువులకు తేడా కూడా అదేకదా? మనకి మనం వున్నాం అని తెలుసు. కానీ జంతువుకు తను వున్నది అని తెలియదు. బుద్ది వెలగక విచక్షణ లేక ఎవరు ప్రవర్తించినా కూడావాని ప్రవర్తన పశుప్రవర్తనయే.

గాయత్రి మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం భక్తితోను, శ్రద్దతోను, ధ్యానమ్ చేసి, జపమ్ చేసి గానం చేస్తాడో వానిలో బుద్ది ప్రచోదనము జరుగుతుంది అనిఋషులు ఇచ్చినటువంటి వాగ్దానము. ఋషుల వాక్కు సత్యమైనటునంటి వాక్కు. వాక్కు యొక్క ఫలితము దానిని అనుసరించిన వారికి మాత్రమేతెలుస్తుంది. ఇతరులకు తెలియదు. గాయత్రి మంత్రము కన్న ఉత్తమోత్తమైన మంత్రము లేదు. గాయత్రి మాత కన్న మించిన జ్ఞాన మూర్తి గాని,కరుణా మూర్తి గాని లేరు. మనకు బాగా జ్ఞానం కలగాలన్నా, మనకి బాగా చదువు రావాలన్నా, మన శరీరంలో తేజస్సు బాగా ఉండాలన్నా,కాంతివంతంగా, కళగా, ఆకర్షణీయంగా ఉండాలన్నా, మనలో బలం పెరగాలన్నా, మనలో మేధస్సు (దేనినైనా సులభంగా అవగాహన చేసుకునే శక్తి)పెరగాలన్నా, కార్యాన్నైనా పట్టుదలతో నీరసం లేకుండా సాధించేటు వంటి శక్తి కావాలనుకున్నా, మనకి దృఢమైన బలాన్నిచ్చేటువంటిది,జ్ఞానాన్నిచ్చేటువంటిది, కార్యదీక్ష నిచ్చేటువంటిది, ఆరోగ్యమునిచ్చేటువంటిది, సమస్తమును ఇచ్చేటువంటిది గాయత్రి.

అందుకని అటువంటి గాయత్రి మంత్రమ్ మనకు పెద్దలు ఒక ఉపదేశంగా అందించారు. మంత్రము వల్ల ఓజస్సు పెరుగుతుంది. ఓజస్సు పెరగటంవల్ల జబ్బులు రావు. భక్తి శ్రద్దలతో నిర్వర్తించుట వలన దానికి ఫలితముంటుంది. లేకపోతే ఫలితముండదు.

గాయత్రి అనగా ఎంత గానము చేస్తే మనల్ని అంత రక్షిస్తుంది. గాయత్రి మంత్రమును శ్రద్దా భక్తులతో చేసుకునే వారకి ఇక ఇతర మంత్రములు ఏమీఅవసరము లేదు. గాయత్రి మంత్రము సమస్తమునూ. సర్వ మంత్రములకు మూలము. గానము బాగా ఎలుగెత్తి బయటకు చెయ్యాలి. చేస్తే శరీరధారుఢ్యము చాలా బాగుంటుంది. గొంతెత్తి పలక గలగాలి. గొంతు ఎంత బాగా పలక గలిగితే లోపలుండేటువంటి గ్రంధులన్నీ ప్రత్యేకించి మణిపూరకంనుంచి వున్న గ్రంధులన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి. అందుచేత గాయత్రి మంత్రాన్ని బాగా పాడాలి. పాడు తున్నప్పుడు దానిని వినాలి. వినకుండాపాడితే ఉపయోగము లేదు. అందుకని వింటూ గానం చేయలంటే దాని అర్ధము తెలియాలి. అప్పుడు మనసు దాని అర్ధము మీద నిలుస్తుంది. అర్ధముతెలియని విషయాల మీద మనసు నిలవదు. గాయత్రి చేస్తే మొదట రక్షణ ఇస్తుంది, రెండోది మన బుద్దులను ప్రచోదనం చేస్తుంది అంటే మన తెలివినిబాగా పదును పెడుతుంది. "థియః యోనః ప్రచోదయాత్" అనగా మా బుద్దులను ప్రచోదనము చేయుగాక! బుద్ది ప్రచోదనము జరిగితే మనకు ఇదితప్పు, ఇది ఒప్పు , ఇది చేసుకో, ఇది చెయ్యకు అని ఇంకొకరు చెప్పనవసరము లేదు. మనకే అన్ని తెలుసి దాని ప్రకారము చేసుకుంటూవెళ్ళవచ్చు. కనుక గాయత్రి బాగా చేసుకునే వారికి లోపలి నుండి గాయత్రి కర్తవ్యాన్ని తెలియజేస్తుంది. మార్గ దర్శనం జరుగుతుంది. లోపలే దైవము,లేక అమ్మవారు, లేక గురువు పేరు ఏదైనా మనకు బుద్దు ప్రచోదమను చేసి మార్గము సుగమము చేస్తుంది.

బుద్ది ప్రచోదనము ఎలా చేస్తుంది అంటే, మనకు చీకటిలో దీపము వలే. దీపము మనయందు నుదిటి యందు, రెండు కనుబొమలకు కొంచెము పైనఉంటుంది. దీపమే గాయత్రి మాత. వెలుగు వుంటుంది. వెలుగు దారి చూపిస్తూ వుంటే దారిలో నడుస్తూ ఉండవచ్చు. వెలుగును మనంపెంపొందిచుకోవాలి. అందుకు గాయత్రి మంత్రము. అప్పుడు మనకి అది మార్గదర్శకత్వము ఇస్తుంది, రక్షణ నిస్తుంది మరియు విపరీతంగా మనబుద్దిని పెంచుతుంది. దానివల్ల ఇక అవగాహన కాని విషయము ఎదీ ఉండదు సృష్టిలో. సాధకుడు పెరిగినదాన్ని బట్టి అవగాహన కూడాపెంచుతుంది. అప్పుడు మహత్తరమైన గ్రంధములు కూడా సులభంగా అవగాహన అవుతాయి. అంటే దైవము గురించి కూడా అవగాహన అవుతుంది.

మంత్రమును ఇచ్చిన ఋషి విశ్వామిత్ర ఋషి. గాయత్రి మంత్రమును చేసే ముందు ఋషుల్ని, గురువుల్ని తలచుకొని ధ్యానము చెయ్యాలి.

గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః

గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

గురు మంత్రము చెయ్యకుండా మంత్రము చేసినా మంత్రము ఫలించటం కష్టము. ఎందుకంటే గురువు యందు మంత్రము సిద్ది చెందిఉంటుంది. అందువల్ల అతన్ని స్మరించి మంత్రము చేయటం వల్ల సాధకునికి కూడా మంత్రము సిద్దిస్తుంది.

గాయత్రి అనగా గానము చేస్తే మూడు రకములుగా అంటే రక్షించేది, నడిపించేది మరియు బుద్ది వికాసము కలిగించి ఆత్మ దర్శనము కలిగించేది.

గాయత్రి ఎవరు? అమ్మవారా లేక అయ్యవారా? దానికి పెద్దలిచ్చిన సమాధానము "గాయత్రి అనగా వెలుగు." ఫాలభాగములో బాగా వెలుగునుదర్శిస్తూ రూపము లేక ధ్యానము చెయ్యాలి. అద్భుతమైన వెలుగును ధ్యానము చెయ్యాలి. వెలుగు వెలగాలి. వెలగటం కోసం ధ్యానమ్ చెయ్యాలి.లోపల వెలగాలి. లోపల వెలగటం కోసమే బయట దీపము వెలిగించాలి. దీపం దేవుడి కోసం కాదు, మనలో వున్న దీపం వెలగాలని బయట దీపంవెలిగించటం. దీపం వెలిగించే సరికి వెలుగు వస్తుంది, అంటే అంతకు ముందు కనపడని వెలుగు ఇప్పుడు కనిపించేది అయ్యింది. కనపడని విద్యుత్వల్ల లైట్లు వెలిగినట్లు. అలా మనలో కూడా కనపడని వెలుగు కనిపించేదిగా వెలిగినప్పుడు అది మనకు మూడో కన్నుగా ఉంటుంది.

కనపడని వెలుగును, వెలుగులకు మూలము అంటారు. వెలుగులకు దేవుడు. మనము చూస్తున్న సూర్యుడి నుండి వస్తున్న వెలుగు ఆసూర్యునిది కాదు. సూర్యునికి వెలుగు ఇచ్చినాయనను సవితృ అంటారు. అలా సవితృనకు వెలుగునిచ్చిన వానిని ఆదిత్య అంటారు. వెలుగుకనపడదు. ఇలా అన్ని వెలుగులకు మూలమైన వెలుగును గాయత్రి మంత్రములో "భర్గో దేవః" అన్నారు. వెలుగుతున్న నక్షత్రాలు, కనిపిస్తున్నసూర్యుడు, కనిపించక వున్న అనేక సూర్యులు అలా వున్న 12 మంది సూర్యులకు వున్న కేంద్రమును "సవితృ" కేంద్రము అంటారు. అలాంటి సవితృకేంద్రములు అనేకము ఉన్నాయు. అలా వెలుగుతున్న సవితలను సంసృతమున "భర్గులు" అంటారు. భర్గులు అనగా వెలిగే వారు. అందు కొంతమందిసూర్యులుగా ఉంటారు, ఇంకొంతమంది తోకచుక్కలుగా ఉంటారు. మరికొంత మంది సూర్యులకు కేంద్రముగా ఉంటారు. అన్ని వెలుగులకుమూలము ఒకటి ఉంది. మూలానికి రూపము లేదు. అది ఆడ అనుకుంటే ఆడ, మగ అనుకుంటే మగ. మూలము వెలుగుకు మూలం తప్పఅది వెలగదు. బల్బు లేనిదే విద్యుత్ వున్నట్లు తెలియదు. బల్బు తీసేస్తే విద్యుత్ వున్నా వెలుగుతున్నట్లు తెలియదు కదా! అలా మొత్తము సృష్టికిఒక మూలము ఉన్నది, దాన్నే "దేవుడు" అని పిలిస్తారు. మూలం ఆధారంగా వెలుగు వస్తోంది. గాయత్రి మంత్రములో "భర్గో దేవస్య ధీమహి"అంటే అలా సృష్టిలో వున్న అన్ని వెలుగులన్నిటికి కూడా మూలమైన వెలుగుగా వున్నటువంటిది ఎదైతే వున్నదో దేవుడ్ని ధ్యానిస్తున్నాను లేకధ్యానిస్తున్నాము.

మనలో వెలుగు సహస్రారము నందు ఉంటుంది. పిలిస్తే వస్తుంది. పిలవకపోతే ఉంటుంది. "తత్సవితు ర్వరేణ్యం" అంటే ఆయన కారణంగావెలుగుతున్న వెలుగు అది మనలో ఫాలభాగంలో వుంటుంది. ధ్యానం చేస్తూ మన సహస్రారము నందు వున్న వెలుగు మన ఫాలభాగము లోనికి దిగివస్తున్నట్లుగా ధ్యానము చెయ్యాలి. దేనికోసం అంటే "థియః యోనః ప్రచోదయాత్". మా బుద్దులను ప్రచోదనం చేయుటకు. ఒక్కక్కరి బుద్ది ఒక్కొరకంగాపనిచేస్తుంది. ఎవరైతే సూర్యోదయం కంటే ముందుగా లేచి శుచియై గాయత్రి మంత్ర జపం చేసి వెలుగును ధ్యానము చేస్తాడో వాడు నిజమైన బుద్దిమంతుడు. బుద్ది కలగాలంటే గాయత్రి బాగా చెయ్యాలి. మంత్రము కలగచేస్తుంది. అందుకని పెద్దలు మనకు మంత్రాన్ని అందించారు.భ్రూమధ్యమున మన బుద్ది పైన సవిత అను దేవత, పైన భర్గో దేవుడు ఉంటారు. గాయత్రి మంత్రములో భర్గో దేవుని ధ్యానము చేసి సవితఅను దేవతను "వరేణ్యం" అనగా నన్ను కౌగిలించుకో అని ప్రార్దన చేస్తాం. అలా సవిత అనే వెలుగు మనలో వెలిగితే లోపలా బయటా మనకు ఇంతకుముందు కనిపించనివన్ని కూడా కనిపిస్తాయి. సమస్త విషయాలు బోధపడతాయి.

సవిత అనే వెలుగు మనల్ని వరించాలని భర్గో దేవుని ధ్యానము చేయాలి. వెలుగు నన్ను ఆవహించు గాక! నా శరీరమంతా వ్యాపించు గాక! అనిభర్గో దేవుని ధ్యానించాలి.



మరికొంత వివరణకు గాయత్రి2 చూడుము...