Tuesday, June 23, 2009

శ్రీ మహాగణేశ పఞ్చరత్న స్తోత్రం


ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం
కలాధరావతంసకం విలాసి లోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం ||1||

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం మాశ్రయే పరాత్పరం నిరన్తరమ్ ||2||

సమస్త లోక శఙ్కరం నిరస్త దైత్య కున్జరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ||3||

అకిఞ్చనార్తి మర్జనం చిరన్తనోక్తి భాజనం
పురారిపూర్వనన్దనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపఞ్చనాశ భీషణం ధనఞ్జయాది భూషణం
కపోలదానవారణం భజే పురాణవారణమ్ ||4||

నితాన్త కాన్త దన్తకాన్తిమన్తకాన్తకాత్మజం
అచిన్త్యరూపమన్తహీనమన్తరాయ కృన్తనమ్ |
హృదన్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం
తమేకదన్తమేకమేవ చిన్తయామి సన్తతమ్ ||5||


||ఫల శృతి||

మహాగణేశ పఞ్చరత్నమాదరేణ యేన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరణం గణేశ్వరం |
అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్ట భూతిమర్భ్యుపైతి సోచిరత్ ||

|| ఇతి శ్రీ శఙ్కరాచార్య విరచితం శ్రీ మహాగణేశ పఞ్చరత్నం సమ్పూర్ణమ్ ||



శ్రీ సూక్తం


శ్రీ సూక్తం

హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.


తా. జాతవేదుడైన అగ్నిహోత్రుడు హిరణ్య వర్ణములు, హరిద్రావర్ణములు కలిగినది, వెండి బంగారు రంగు హారములు ధరించినది, ఆహ్లాద స్వరూపిణి, హిరణ్య సంపదతో చేయబడిన మూర్తి గలది అగు లక్ష్మిని నాకు కలుగు చేయునుగాక !

తాం
ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్


తా. వేదములయందు పుట్టిన వెలుగైన అగ్ని ఎల్లప్పుడునూ విడిచిపోని లక్ష్మిని నాకు ఆవహింపచేయుము. దాని వలన కిరణములు, బంగారములు, గోవులు, అశ్వములు, పురుషులు అను సంపదను నేను పొందగలను.

అశ్వపూర్వాం
రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీమ్
శ్రియం దేవీ ముపహ్వయే శ్రీర్మా ర్దేవీ ర్జుషతామ్


తా. తొలుత అశ్వములు, నడుమ రథములు, కొనకు ఏనుగులు నిలబడి శబ్దము చేయుచుండగా మేల్కొలుపులను పొందుచూ వెలుగుల నాశ్రయించి నట్టి శ్రీదేవిని మేము ఉపాసన చేయుదుము. మమ్ము అట్టి శ్రీదేవి అభిలషించి ప్రోత్స హించునుగాక!

కాంసోస్మితాం
హిరణ్యప్రాకారామ్
ఆర్ద్రామ్ జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్


తా. పరమపురుషుడగు నారాయణడు ఎవరిని తన అస్థిత్వముగా ఏర్పరచుకొనెనో అట్టి హిరణమయ ప్రాకార రూపము గల ఆమెను, రసస్వరూపిణి, జ్వాలా స్వరూపిణి తృప్తి స్వరూపమై సృష్ఠికి తృప్తి కలిగించు ఆమెను, పద్మమున నిలిచి యున్న పద్మ వర్ణమూర్తి అగు ఆమెను శ్రీదేవిని నాయందు ఆవాహన చేయుచున్నాను.

చంద్రాం
ప్రభాసాం యశసా జ్వలంతీమ్
శ్రియం లోకే దేవజుష్టా ముదారామ్
తాం పద్మినీ మీం శరణ మహం
ప్రపద్యేలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే.


తా. చంద్రాత్మక మైనది వెలుగులు వెదజల్లునది, ప్రశస్థిచే లోకమునందు వెలుగుచున్నది, దేవతల ప్రీతిని చూరగొ న్నది, ఔదార్యముగలది, పద్మ లక్షణములు గలది, ఈంకార స్వరూపిణి అగు శ్రీదేవిని నేను శరణాగతి చేయు చున్నాను. నిన్ను వరించుట వలన నాయందు ఉన్నటువంటి అలక్ష్మి తొలగు గాక!

ఆదిత్య
వర్ణే తపసోథిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః
తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యలక్ష్మిః


తా. ఆదిత్యుని వర్ణముతో వెలుగొందు శ్రీదేవీ, నీ తపస్సుచే అధిష్ఠించి పుట్టిన బిల్వములు అను వనస్పతి దాని ఫలములు, మాతపస్సు చేత మాలోని మాయా సంభవమైన లోపలి వెలుపలి అవలక్షణములు తొలగించు గాక!

ఉపైతు
మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాతుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం తదాతుమే


తా. కీర్తితోను, మణులతోను కలిసి దేవతల సఖుడగు కాముడు నాకెదురు వచ్చి సమీపించుగాక. నేను ఉద్బవించిన రాష్ట్రమునందు అతడు నాకు సమృద్ధిని కలిగించుగాక!

క్షుత్పిపాసా
మలాం జ్యేష్ఠా మలక్ష్మీం నాశయామ్యహమ్
అభూతి మసమృద్ధిం సర్వాన్నిర్ణుద మే గృహాత్


తా. ఆకలిదప్పులు, మలినలక్షణములు కలిగినటువంటి జేష్ఠాదేవి అనబడు అలక్ష్మిని నేను నశింపచేయుచున్నాను. సంపద సమృద్ధి నాయింటి నుండి తరగకుండా అనుగ్రహించి నీవు అలక్ష్మిని పోగొట్టుము.

గంధద్వారాం
దురాధర్షాం నిత్యపుష్ఠాం కరీషిణీమ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్


తా. సుగంధములతో కూడిన ద్వారము కలది, సులభముగా సమీపించుటకు వీలుకానిది, ఎల్లప్పుడునూ పుష్ఠిగా నుండునది, కిరణములతో ఆకారము కట్టుకొన్నది, సర్వ జీవులకు పరమేశ్వరి అగు శ్రీదేవిని మమ్ము సమీపించ మని ఆహ్వానించుచున్నాము.

మనసః
కామమాకూతిమ్ వాచః సత్యమశీమహి
పశూనాగ్ం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః


తా. మనస్సు యొక్క కోరికను, కుతూహలములను, వాక్కుయొక్క సత్యతను నీయందు రూపొందించు కొందును. పశుసంపద యొక్క అన్నము యొక్క రూపమును నీయందు రూపొందించు కొందును. కీర్తి స్వరూపమగు శ్రీదేవి నాయందు ఆశ్రయము చెందుగాక!

కర్దమేన
ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రీయం వాసయ మే కులే మాతరం పద్మ మాలినీమ్.


తా. కర్దముడను ప్రజాపతి చేత సంతతిగాపొందబడిన సువర్ణ కర్దమ స్వరూపిణీ, నాయందు కర్దమ స్వరూపిణియై ఉద్బవింపుము. ఓకర్దమ ప్రజాపతి, మతృస్వరూపిణియు, పద్మాలంకృతియు అగు శ్రీదేవిని మావంశమునందు వశింప చేయుము.

ఆపసృజంతు
స్నిగ్దాని చిక్లీత వసమే గృహే
నిచదేవీం మాతరగ్ం శ్రియం వాసయ మే కులే .


తా. చిక్లీతుడా! సరసములైన జలములను సృష్టించుగాక. నీవు నాగృహమున వసింపుము. మాత అయిన శ్రీదేవిని నా వంశమున నిశ్చయముగా వసింపచేయుము.

ఆర్ద్రాం
పుష్కరిణీం పుష్ఠిం పింగళాం పద్మ మాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ .


తా. జాతవేదుడా ఆర్ద్ర స్వరూపిణియు, కలువల, తమ్మి పూవుల దండ ధరించినదియు, పోషణము, పుష్ఠి కలిగించు నదియు, పింగళ వర్ణము కలది, హిరణ్మయమూర్తి చంద్రుని స్వరూపము కలది అగు లక్ష్మిని నాయందు ఆవహింపచేయుము.

ఆర్ద్రాం
యః కరిణీం యష్ఠిం సువర్ణాం హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ


తా. జాతవేదుడా ఆర్ద్ర స్వరూపిణియు, ఏనుగుల వైభవము కలదియు, యజ్ఞ దండ స్వరూపమైనదియు, సువర్ణ కాంతులు కలిగినదియు, హేమమాలికలు ధరించినదియు, సూర్య కిరణముల స్వరూపమును సాక్షాత్కరించినదియు అగు హిరణ్మయ మూర్తి అగు లక్ష్మిని నాయందు ఆవహింపచేయుము.

తాం
ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్ .


తా. జాతవేదుడా ఎన్నడూ ఎడబాయని లక్షణములు కలిగిన లక్ష్మిని నా యందు ఆవాహనచేయుము. ఆమె యందు కొల్లలుగా హిరణ్యము, గోవులు, అశ్వములు, పురుషులు, దాసదాసీ జనము నేను పొందుదును.