Tuesday, June 16, 2009

విదుర నీతులు1

విదుర నీతులు కొన్ని మహాభారతము నుండి

  • సత్ప్రవర్తనము ద్వారా దీర్ఘకాలమునపొందు సంపద స్థిరమై తృప్తిని కలిగించును.
  • బుద్ధిమంతుడు సత్ప్రవర్తనను ప్రయత్నించి కాపాడుకొనవలెను.
  • సంపదలను, కీర్తిని కాపాడుకోన యత్నించుట అవివేకము. సత్ప్రవర్తనను కాపాడుకొనుట వివేకము.
  • స్నేహమునకు విశ్వాసము ప్రాణము.
  • భయము, అనుమానము స్నేహమునకు శత్రువులు.
  • నమ్మకములేని సంబంధము నేతిబిరకయలోని నేయివంటిది.
  • చపలచిత్తుడు, పెద్దలను గౌరవింపనివాడు, విచక్షణారహితుడు, స్నేహమును నిలబెట్టుకోనలేదు.
  • విషయలోలుడు, చపలచిత్తుడు, మూర్ఖుడు సంపదను నిలబెట్టుకొనజాలడు. కాలక్రమమున అతడన్నిటిని చేజార్చును.
  • మేఘములు కదలు మార్గ మెవ్వరును ఉహించలేరు. అవి గాలివాటున కదలుచుండును. మూర్ఖుల ప్రవర్తన కూడ గాలివాటు ప్రవర్తనమే. వారెప్పు డనుగ్రహింతురో, ఎపుడాగ్రహింతురో ఎవ్వరికిని తెలియదు. అట్టి మూర్ఖులకు దూరముగ నుండుట మేలు.
  • మనసునందు ఘర్షణ పెరిగినచో అది ప్రాణమును బలహీనపరచును. జ్ఞానమును కొడిగట్టించును. రోగమును పోషించును. రూపమున కళను హరించును.
  • శోకము వలన కోల్పోయినది రాదు. శోకము దేహమును దహించుచుండును. నీ శోకము నీవు గిట్టనివారి కానందము కలిగించును. శోకమున బడుటకన్న అవివేకమేమియు లేదు.
  • మానవు డనేకమార్లు జనించును. అనేకమార్లు మరణించును. అనేక జన్మలలో హాని వృద్ధులను చవిచూచును. కొన్ని జన్మలలో పొందుట నేర్చును. మరికొన్ని జన్మలలో పంచుట నేర్చును. ఇతరులను గూర్చి దుఃఖపడును. ఇతరులు తనను గూర్చి దుఃఖపడుట అనుభవించును. సుఖము - దుఃఖము, లాభము - నష్టము, జననము - మరణము వీనివెవ్వరు తప్పించుకొనజాలరు. కావున సుఖమునకు పొంగుట, దుఃఖమునకు క్రుంగుట అవివేకము.
  • జ్ఞాన మార్గమున ఆరు బిలము లున్నవి. అందు పడినచో జీవుడు మరల మొదటికే వచ్చును. ఆరును వైకుంఠపాళి యందలి పాములవంటివి. ఐదు ఇంద్రియార్థములు, అహంకారము సముపార్జించిన జ్ఞానమును మ్రింగివేయుచు నుండును. వివేకవంతుడు వీని విషయమున జాగరూకుడై యుండవలెను.
  • అత్యాశ, యింద్రియలోలత్వము, ఆత్మావలోకనము లేకుండుట, అజ్ఞానము - నాలుగు భావము లెచ్చట నుండునో అచ్చట శాంతి యుండదు.

మరికొన్ని త్వరలో....