Wednesday, July 18, 2012

మోక్ష లక్షణములు



భాగవతము నందు సూచించిన మోక్షలక్షణములు:

1.      అనువుగానిచోట నేర్పులు చూపక మౌనముగా ఉండుట.
2.     లభించినదానికి తృప్తి చెందుయుండుట.
3.     చర్చలు జరుగుచోట మాటాడకుండుట.
4.     పదిమంది చేరినచోట అందేమున్నదో అని ఉత్సుహించకుండుట, ఉత్సాహము చూపకుండుట.
5.     ఎవ్వరిని ఏదియు కోరకుండుట.
6.     లోకులపై కోపింపకుండుట.
7.     సమస్తము నందును ఈశ్వరుని దర్శించుట, వినుట, అవసరమగుచో సేవించుట.

Monday, July 2, 2012

అంతర్ముఖ సాథన - శాశ్వత జీవనము



సృష్టిలో తనకు తాను ఉన్నట్లుగా తెలిసిన జీవి మనిషి మాత్రమేమనస్సనే ప్రజ్ఞ వికసించుటవలన మనిషి తాను ఉన్నట్లుగా తెలియగలుగుచున్నాడుఇతర జీవరాశులకు వాటికి అవి ఉన్నట్లుగా తెలియదుఇతరవాటిని గుర్తించగలవుఇంద్రియములను నడిపించునది మనసుమనస్సు ఇంద్రియ వశమైనప్పుడు మనిషి సుఖదుఃఖముల వలయములో చిక్కుకొని శాంతిలేక జీవించునుఇంద్రియములు మనస్సువశమై, మసస్సు బుద్దితో అనుసంధానము చెంది ఉన్నచో మనిషి జీవితమున శాంతిని పొంది ఇతరులకు మార్గదర్శకత్వము వహించును

బయట, లోపల కూడా దర్శించగల శక్తి కలది మనస్సుబయట మాత్రమే చూడగలిగి అంతర్దర్శనము చేయలేనిదానికి "పశ్యక" అంటారుపశ్యక థాతువు నుండే పశువు అనే పదము పుట్టినదిబయట లోపల కూడా దర్శించగలిగినవానిని "కశ్యప" అంటారుసాధారణముగా అందరూ "పశ్యక"లేపశ్యకుడు కశ్యపుడుగా మారుట ఎట్లో చూద్దాం...

భగవంతుడు మనిషిని తనంతటి వానిగా తయారుచేశాడు అని పెద్దలు చెబుతారుబైబిల్ లో "God made man in his image and likeness" అని చెప్పబడినదిభగవంతుని యందు ఎటువంటి ప్రజ్ఞలు పనిచేస్తున్నాయో మానవుని యందు కూడా అటువండి ప్రజ్ఞలు పనిచేస్తున్నాయికనుకనే మనిషి అనే యంత్రము పనిచేస్తోందిఅంతర్ముఖము చెంది అంతర్దర్శనము చేయగలిగిన వాడే మనిషిఇంద్రియములు బహిర్ముఖము చెందినప్పుడు ఎలా పనిచేస్తాయో అలాగే అంతర్ముఖము చెందినపుడు అవే ఇంద్రియములు అంతర్ముఖముగా కూడా పనిచేస్తాయిఅప్పుడు మనస్సు సూక్షమైన విషయములను గ్రహించగలదుఅటువంటి మనస్సు బుద్దితో అనుసంధానము చెందగలదుఅలా అనుసంధానము చెందిన మసస్సు బుద్దినుండి వచ్చు ఆదేశములను అందుకొనగలదుఅలా బుద్దితో అనుసంధానము చెందిన వాడు తనయొక్క ప్రణాళికను లోపలి నుండియే అందుకొనునుఅది దివ్యప్రణాళికలో భాగమై ఉండును.   ఇతరులు తమ ప్రణాళికను తామే తయారుచేసుకొని అందు చిక్కుకొనునుఅది బయట ప్రపంచములో తాను చేయదలచిన వాటిని అనుసరించి ఉండును

మనస్సును అంతర్ముఖము చేయదలచినవాడు ముందుగా తనకు తాను నిర్ణయము చేసుకొనవలెనుతాను దానికి సిద్ధమా కాదా అనిఅందరివలెనే జీవించవలెనా లేక తన జీవిత ప్రణాళిక తెలిసి దానిని జన్మల తరబడి ఎలా నిరంతరముగా ఎలా నిర్వర్తించవలెనో తెలిసి జీవించవలెనా అని నిర్ణయము తీసుకొనవలెనుఒకసారి నిర్ణయము తీసుకొన్నచో దానిని నియమముతో అభ్యాసము చేయవలెనుఅభ్యాసమునందు అంతరాయములు లేకుండా చూసుకొనవలెనుఅంతరాయము వచ్చినచో సాథనకు ప్రాముఖ్యత ఇవ్వవలెనుసాథనకు ప్రాముఖ్యత పెరిగి నియమముతో అభ్యాసము చేసినచో మిగిలినవన్నికూడా సాథనకు అనుగుణముగా మారునుశాశ్వతత్వమును అందించే ఆధ్యాతిక సాథన ముఖ్యమా లేక తాత్కాలికమైన ప్రాపంచిక విషయాలకు సాథనను త్యాగము చేయుటయా అని అలోచించినచో సాథకునకు నిర్ణయము తననుండియే వచ్చునునిర్ణయము తీసుకొన్న తరువాత సాథన విషయములో రాజీ కూడదుఅదే నిజమైన వైరాగ్యముఇటువంటి వాటికి స్థిరమైన నిర్ణయము తీసుకొన్నచో ఇటువంటి సాథన చేయవలెను, లేనిచో సమయము వృథా చేయటమే

కన్నులు మూసుకొని లోపల జరుగుతున్న దానికి గమనించ వలెనుఉశ్వాస, నిశ్వాసలను గమనించ వలెనుపుట్టినది మొదలు మరణము వరకు మనతో ఉందునది శ్వాసయేప్రతిదినము ఒకే సమయనికి సాథ్యమైనంత సమయము దీనిని గమనించ వలెనునిరంతరము అభ్యాసము చేయవలెనుశ్రద్ద, ఓర్పు చాలా అవసరముశెలవు దినములను దీనికి ఉపయేగించుకొనవచ్చునుబాహ్యప్రపంచములో తిరుగు మనస్సు అంతర్ముఖము చెందుటకు సాథ్యపడదువిసుగు విరామము లేకుండా బయట తిరుగుటకు అలవాటు పడినవానిని కొద్దిసేపు కదలక, మెదలకు కూర్చొనమన్నచో ఎలా ప్రశాంతముగా ఉండలేడో, అలాగే మనస్సుకూడా అంతర్ముఖము చెందదుఅప్పుడు ఎంతో శ్రద్ద, ఓర్పు అవసరముమనకుగా మనము సాథన చేయుట కష్టము అయినచో ఇటువంటి సాథనచేసి మనస్సుని అంతర్ముఖము చెందు వానితో జతకట్టవలెనుఅయస్కాంతమును చేరిన ఇనుపముక్క అయస్కాంతత్వమును పొందినట్లు మనకు కూడా సాథన కలిగి మనస్సు అంతర్ముఖము చెందునుమనలాగే తిప్పలు పడుచున్నవానితో సాథనచేసినచో అధైర్యము కలిగి సాథనకు అంతరాయము కలుగునుకనుకనే గురువు యొక్క అవసరము ఉన్నదిఅంతర్ముఖుడై దైవముతో నిరంతరము అనుసంధానము కలిగివుండువాడు గురువుఅట్టి సద్గురువు యొక్క సాన్నిధ్యములో సాథన నిరంతరాయముగా సాగినచో త్వరగా సిద్ది కలుగునుసాథకుని తపన యొక్క తీవ్రతను బట్టి గురువు లభించును

విరాట్పురుషునిలో చెప్పబడిన ప్రజ్ఞలన్నియు మానవునియందు ఉన్నవిపురుషసూక్తమున వీటిని వర్ణించినారుభాగవతమున విరాట్పురుషుని ఆవిర్భావమున విస్తారమైన వివరణ ఉన్నదివాటిని ధ్యానమున ప్రతిదినము జ్ఞప్తికి తెచ్చుకున్నచో అవి మనయందు మేల్కాంచి మనయొక్క ప్రజ్ఞ ఊర్ద్వగతి చెందుటకు సహకరించును.     షట్చక్రములు (సహస్రారముతో కలిపి ఏడు), జ్యోతిష చక్రములోని ద్వాదశరాశులు, నవగ్రహములు, సప్తఋషులు, ధృవమండలము, సనక,సనందన, సనత్కుమార సనత్సుజాతులు (భగవానుని చతుర్వ్యూహములు), నారదమహర్షి (Messenger of God, భవంతుని తెలుసుకొనవలెనన్న తపనను అనుగ్రహించువాడు) మొదలగు ప్రజ్ఞలను మనయందు అంతర్ముఖముగా దర్శనముచేసినచో మనసు అంతర్ముఖము చెంది సమాధి స్థితి యందు నిలచునుఅంతర్ముఖము చెందిన మనస్సును చిత్తము అంటారుఅట్టి చిత్తము మాత్రమే బుద్దితో అనుసంధానము చెందగలదుఅప్పుడు మాత్రమే దివ్యప్రణాళికను అందుకొని పనిచేయుటకు అవకాశము ఉన్నదిఅట్టివానికి తన సొంత ప్రణాళిక ఉండదుదైవము వాని ద్వారా పనిచేయునుపాలు కంటే పెరుగు ఎక్కువకాలము ఉండునుపెరుగు నుండి తీసిన వెన్న ఇంకొంత ఎక్కువకాలము ఉండునువెన్నకాచిన నెయ్యి వీటన్నికంటే ఎక్కువకాలము ఉండునుఅటులనే అంతర్ముఖము చెంది చిత్తవృత్తి నిరోధము జరిగి సమాథిస్థితికి చేరిన సాథకునికి అంతఃకరణ శరీర నిర్మాణము జరిగి అందు జీవించుట జరుగునుస్థూలదేహము పడిపోయినను, అంతఃకరణ శరీరమునందు జీవించునుస్థూలశరీరము కన్నా దానికి ఆయుర్థాయము ఎక్కువఅట్టి వాడు భౌతిక దేహము వచ్చిపోవుచున్ననూ తాను మాత్రము దివ్యదేహమునందు శాశ్వితుడై జరుగుతున్నదంతయూ లీలగా గ్రహించుచూ దివ్యపణాళికలో తన కర్తవ్యమును అనేక జన్మల తరబడి నిర్వర్తించునుఅట్టివారు పరమగురువులుఅనేక శాతాబ్దములుగా మానవ పరిణామమునకు పనిచేయున్నవారువారు ప్రేమమూర్తులు

అంతర్ముఖము చెందని వాని మనస్సుకు స్థిరత్వము లేదుస్థిరత్వము లేని మనస్సుకు శాంతి లేదు.  శాంతిలేని వాడు శాశ్వతత్వమును పొందలేడుజనన, మరణ చక్రములో నరకయాతన అనుభవిస్తూనే ఉంటాడుకనుక ప్రతి ఒక్కరూ సాథన చేసి అంతర్ముఖులై శాశ్వతతము చేందుటకు ప్రయత్నము చేయవలెనని ఆకాంక్షిస్తున్నాను