Saturday, August 4, 2012

శబ్దబ్రహ్మము - పరబ్రహ్మము మాస్టర్ సి.వి.వి.


మానస సరోవరం వద్ద మాస్టరు గారి దర్శనము (ఊహా చిత్రము)



ఈరోజు మాస్టరు సి.వి.వి గారి జన్మదినము.  1868 ఆగస్టు 4 మాస్టరు గారు తమిళనాడులోని కుంభకోణములో జన్మించారుచిన్నతనములోనే అనేభాషలలో ప్రావీణ్యము సంపాదించారుభాష దాని శబ్దము, శబ్దతరంగములలోని అనేకానేక రహస్యములను అవగతము చేసుకొన్నారు.  1910లో దిగివచ్చిన కుంభచైతన్యమును అందుకొని విశ్వప్రణాళికలో భాగంగా మానవజాతిని దైవసామ్రాజ్యములోనికి నడిపించుటకు వచ్చిన పరబ్రహ్మ స్వరూపులు మాస్టరు సి.వి.వి గారు.

మాస్టరు సి.వి.వి అనే మహా చైతన్యం ఎక్కడెక్కడో ఊర్ధ్వ లోకాల నుండి దిగివచ్చి, మన గోళం చేరుకొని, కేవలం మనమీద ఉండే అపారమైన ప్రేమ, కరుణ, ఆదరము, వాత్సల్యం కారణాలుగా మనల్ని ఉద్ధరిద్దామని మనల్ని చేరిందిమూలము మరచి భౌతికములో కూరుకు పోయిన మానవుని ప్రజ్ఞను ఉద్దరించి త్వరితగతిన మోక్షధామము చేర్చుటకు దిగి వచ్చిన పరబ్రహ్మము మాస్టరు సి.వి.వితనలోనికి దిగివచ్చిన దివ్య ప్రణాళికను అవగతము చేసుకొని దానితో చేయవలసిన ప్రయోగములన్నీ చేసి ఎటువంటి మార్పులు చేసినచో మానవుడు దివ్య శరీరమును పొందగలడో అటువంటి మార్పులకు కావలసిన యోగమును మానవ జాతికి అందించిన వారు మాస్టరు సి.వి.వినిజముకు యోగము పాతదే ఐననూ ఆయన అందించిన విథానము కొత్తదితనంతట తాను నియమ నిష్టలు పాటించి, యోగము అభ్యసించి సిద్దిపొందుట ఒక పద్దతిఅది ప్రాచీనముఅలా చేయుట కలి ప్రేరితమైన మానవునికి అసాద్యము కనుక దానిని తాను నిర్వర్తించి జీవుని సిద్దింపచేస్తాను అని చెప్పిన వారు మాస్టరు సి.వి.విమాస్టరు గారు మన యందు యోగమును సిద్దింపచేయుటకు మనము చేయవలసినది ఒక్కటే "మనలను ఆయనకు సమర్పించటమే".  అందుకు మనకు ఆయన అందించిన ప్రార్థనా విథానమును పాటించుట ఒక్కటే మార్గము.

ప్రార్థన:
ప్రతిరోజూ క్రమము తప్పకుండా ఉదయం, సాయంత్రం 6గంటల సమయానికి శరీరం, మనసు శుచిగా వుంచుకొని, మాస్టరుగారి చిత్రపటాన్ని ఉత్తర ముఖముగానో, తూర్పు ముఖముగానో వుంచి, అగరువత్తులు, దీపం వెలిగించి, సుఖము, స్థిరము అయిన ఆసనం ఏర్పరుచుకొని కూర్చోవాలి. హృదయంలోనో, భ్రూమద్యంలోనో మాస్టరుగారిని మానసికంగా దర్శించి, నమస్కారం చేస్తూ "మాస్టర్ సి.వి.వి నమస్కారం" (Master C.V.V. Namaskaram) అని ఉచ్చరించాలి. అలా ఉచ్చరించినపుడు మాస్టరుగారు (పద్మాసనాసీనులై యున్నవారు) తన దక్షిణ (కుడి) హస్తంతో మనలను ఆశీర్వదిస్తున్నట్లు, యోగమారంభించ మంటున్నట్లు, తాను పని ప్రారంభిస్తున్నట్లు, మనము సాక్షీభూతముగా మన దేహ కోశములందు జరుగు మార్పు లను చూస్తున్నట్లు భావించాలి. మార్పులు జరుగుతున్నత సేపు కనులు తెరుచుకోవు. రోజుకు వర్కింగ్స్ (workings) పూర్తి అయిన తరువాత కనులు తెరుచుకుంటయి. రోజున ఎంతవరకు జరిగితే శ్రేయస్సో, అంతవరకే మాస్టరుగారు మార్పులు (వర్కింగ్స్) జరుపుతారు.

ఎప్పుడు చేయాలి:
ఇక్కడ మనకు ఒక అనుమానము రావచ్చును.  6 గంటలకే ఎందుకు చెయ్యాలి.  మొదట 4-8 గంటల మధ్యలో చేసుకొనమని చెప్పిననూ చివరకు 6 గంటలకు స్థిరపరిచారు.  6 ఎందుకో చూద్దాం..
సృష్టిలో చతుర్వ్యూహములతో వ్యక్తమయ్యే దైవము రోజులో నాలుగు ముఖ్యమైన భాగములను ఏర్పరుస్తాడుఒకటి పూర్తి చీకటి (అర్థరాత్రి), ఇంకొకటి పూర్తి వెలుగు (మధ్యాహ్నము).  మిగిలినవి సంధ్యలుఅప్పుడు వెలుగు చీకటులు సమముగా వుంటాయిఅవి రాత్రి 12 గం. పగలు 12 గం. ఉదయము, సాయంత్రము 6 గంరాత్రి సమయము నిద్ర, పగటి సమయము దేహ పోషణమునకు కావలసిన దాని సంపాదనమిగిలిన సంధ్యా సమయములు దైవ ప్రార్థనకు అనుకూలమైన సమయాలుసాయంకాలము కంటే ఉదయము ముఖ్యమైనదిఎందుకంటే నిద్రలేచిన వెంటనే మనస్సు ప్రశాంతముగా ఎటువంటి కలతలు లేక ఒకవిథమైన నిశ్చలతను పొంది వుంటుంది కనుక అటువంటి మనస్సుతో చేసిన ప్రార్థన మనలను త్వరగా మాస్టరుగారి సన్నిధికి చేరుస్తుందిఅలాకాక నిద్రలేచిన తరువాత, కొన్ని సేపు గడచిన తరువాత, వారితో వీరితో అవి, ఇవి మాట్లాడి, పేపరు చూసి, తీరుబడిగా ప్రార్థనకు వెళ్ళిన మనస్సు ప్రశాంతత కోల్పోయి కలుషితమై వుంటుంది కనుక ప్రార్థన యొక్క ముఖ్య ఆవశ్యకతను పొందుటకు వీలు కలుగదుఉదయము 6 గం.లకు చేసిన ప్రార్థన వల్ల కలిగినంత ప్రశాంతత సాయంకాలపు ప్రార్థన ఇవ్వదు రోజు కార్యక్రమముల మద్య నలిగిన మనస్సే కారణము.   ప్రతిరోజు ఒకేపని ఒకే సమయానికి క్రమము తప్పకుండా శ్రద్దతో చేసిన అది మనలో కావలసిన సమస్త మార్పులను అందిస్తుందిమనలోని అయస్కాంతత్వమును పెంచుతుందిఅటువంటి శిష్యుని గురువు దగ్గరికి చేర్చుకుంటాడు

6 గం. సమయానికి ఎవరైనా తన కర్తవ్య నిర్వహణలో వున్నచో వారు ఎక్కడ వుంటే అక్కడనే మనస్సులో మాస్టరుగారికి నమస్కారము చేసుకొని తరువాత వీలువెంట ప్రార్థన చేసుకొన వచ్చునుకర్తవ్యమంటే శ్రీకృష్ణుడు చెప్పిన కర్తవ్యమేసినిమాకి వెళ్ళాం, క్రికెట్ వస్తోంది, స్నేహితులు వచ్చారు... ఇలాంటివి కాదుఅంతే కాని ఉదయము నిద్ర లేవటము కష్టముగా వున్నది కనుక మనకు నచ్చిన సమయానికి ప్రార్థన చేసినచో అది మాస్టరుగారికి ఇష్టము వుండదుఅది ఆయన మెచ్చరు అని గుర్తివుంచుకోవాలిగురువు చెప్పినట్లు శిష్యుడు ఆచరించాలి, అంతే కాని శిష్యుడు చెప్పినట్లు గురువు అనుగ్రహించడు

ఎంతసేపు చేయాలి:
మాస్టరుగారు నిర్దేశించిన సమయము 15 ని.లుకాని ఒకవేళ మాస్టరుగారు మనలో కావలసిన మార్పులు చేయుచున్నచో అప్పుడు ఎంత సేపు అయినా గడవవచ్చునుఅది ఆయన ఇష్టముకనుక ప్రార్థన ఇంతసేపే అనే భావన లేకుండా ప్రార్థనలో కూర్చోవాలికొన్ని సార్లు 15, 20, 30, 40 లేక ఒక గంట అయినా అవవచ్చుమనకి కన్నులు తెరవాలి అని అనిపించదుకేవలము ఇంతసేపు అనే భావన వున్నచో సమయము లెక్కించటమే అవుతుందికనుక ఎంతసేపు అన్న భావన వద్దు

సమర్పణ:
"మాస్టరుగారు..నేను, నా స్వభావము, దేహము, మనస్సు, బుద్ది, ఇంద్రియమలు, అహంకారములతో మీ పాదముల చెంత సమర్పణ చెందుచున్నానువాటియందు కావలసిన మార్పులను అనుగ్రహించి సమస్త కోశములను పరిశుద్ది గావించండినాలోని భావములను, కోరికలను ధర్మయుక్తము చేయండికామమును తగ్గించి ప్రాణముకు పెంపొందించండి.   సూక్ష్మదేహ నిర్మాణము చేసి అమరత్వమును ప్రసాదించండిమీ దివ్య ప్రణాళికలో నాకునూ కర్తవ్యన్ని, బాధ్యతను ఏర్పరచండినన్ను పరహితమునకు అంకితము చేయండినేను మీకు సదా వాహికనై వుండునట్లు అనుగ్రహించండిసృష్టిలోని సమస్త జీవరాశులు సంతోషముగా, ఆరోగ్యముగా, ఆనందముగా వుండేటట్లు అనుగ్రహించండి" అని ప్రార్థించి అయన చెప్పినట్లు లోతట్టున జరుగుతున్న మార్పులను గమనించాలి.

క్రమము తప్పని ప్రార్థన, ఇతరుల నుండి ఏమియు ఆశించకుండా ఉండటము, ఫలితమాసించని సేవ చాలా ముఖ్యముఅలా తనకు సమర్పణ చెందినవారిని తనంతటి వారుగా చేస్తాను అని మాస్టరుగారి వాగ్దానముమనకు కలిగిన సమస్త కోరికలను ఆయనకే సమర్పించినచో మనకి ఏది శ్రేయస్సో దానిని ఆయన అనుగ్రహిస్తారు. అప్పుడు జీవితము ఆనందమయము అవుతుందిఅనవసరపు కోరికలు కలుగవుసర్వ కాల సర్వావస్థల యందు ఆయన రక్షణ, శిక్షణ మనకు అందుతాయిమరణము లేని స్థితికి చేరుతాముఅంటే శరీరము లేకున్ననూ జీవించి వుండే స్థితిచింతామణి వంటి మాస్టరు గారు మన చెంత వుండగా చింతలేలఆయనను స్మరిద్దాం, శరణువేడుదాం ఆయన చెప్పినట్లు ప్రార్థన చేద్దాం.

మాస్టరు సి.వి.వి గారి పాద పద్మములకు నమస్కారము.