Monday, June 13, 2011

2012 - అంతమా లేక ఆరంభమా


2012
లో ఏమి జరుగుతుంది? నిజంగానే ప్రపంచము అంతరిస్తుందా? ఏమవబోతోంది? ప్రస్తుతము మానవ జాతి మనసులో నలుగుతున్న ప్రశ్న. భయపెడుతున్న ప్రశ్న. మయన్ క్యాలెండరు రాబోవు 2012తో ముగుస్తుంది కాబట్టి ప్రపంచము కూడా అంతరిస్తుంది అనే ఒక వార్త ప్రపంచమంతా క్షణ కాలములో చుట్టి వచ్చింది. అదేమిటో ఒకసారి చూద్దాం......

భూమి సూర్యుని చుట్టి రావటానికి 360 రోజులు పడుతుంది. 360 రోజులలో ప్రతి 90 రోజులకొకసారి ఒక్కొక్క point చొప్పున నాలుగు points వస్తాయి. వాటిని మన పెద్దలు విషువత్ పుణ్య దినములు అన్నారు. అవి March 21st, June 21, September 22nd మరియు December 21st. వీటిలో March 21st మరియు September 22nd లలో రాతి, పగలు సమానముగా వుంటాయి. June 21st పగలు ఎక్కువ రాత్రి తక్కువ, అలాగే December 21st రాత్రి ఎక్కువ పగలు తక్కువగా వుంటాయి. రోజులలో సూర్యుని నుండి ఒక ప్రత్యేకమైన శక్తి విడుదల అవుతుంది. అది జీవుని అభివృద్దికి దోహద పడుతుంది. కనుక వాటిని పుణ్యదినములుగా గుర్తించి ధ్యానమునకు ఎంతో ముఖ్యమైనవని పెద్దలు నిర్ణయించారు.

మన సౌర కుటుంబము వున్న నక్షత్ర మండలాన్ని పాలపుంత (Mikly Way Galaxy) అంటారు. దాని కేంద్రమును గాలెక్టిక్ సెంటర్ (Galactic Center) అంటారు. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ వుండటం వల్ల మనమున్న నక్షత్ర మండలము కూడా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నిజానికి అవన్నీ స్థిరమైనవి. అలా తిరుగుతున్నప్పుడు భూమి యొక్క అక్ష్యము (Axis) కూడా మారుతూ వుంటుంది. అది ఒక వృత్తము పూర్తి అవటానికి 26000 సంవత్సరములు పడుతుంది. దానినే precession of equinoxes అంటారు.మొత్తము 360 డిగ్రీలు వున్న వృత్తములో 72 సంవత్సరముల కొకసారి ఒక డిగ్రీ చొప్పున మొత్తము 26000 సంవత్సరములు పడుతుంది. దీనిని కాస్మిక్ సంవత్సరము అంటారు. అలా Galactic Center చుట్టూ తిరిగేటప్పుడు పైన చెప్పినట్లు ప్రతి 6500 సంవత్సరముల కొకసారి ఒక point మీదకు భూమి వస్తుంది. అలా వచ్చినప్పుడు మన సూర్యుడు Galactic Centerతో సమాంతరము (alignment) చెందటము జరుగుతుంది. అప్పుడు Center నుండి పరిణామమును వేగవంతము చేసేటటువంటి అత్యంత బలమైన శక్తి విడుదల అవుతుంది. అటువంటి ఒక point మీదకు మనము 2012 December 21st చేరబోతున్నాము. ఆరోజున మన సూర్యుడు సరిగ్గా Galactic Center ఎదురుగా ఉదయిస్తాడన్న మాట. నిండుగా వున్న జలాశయానికి వున్న ఆనకట్ట ద్వారాలు తెరిస్తే నీటి ప్రవాహము ఎలా వుంటుందో అలా ఆరోజున Galactic Center నుండి శక్తి ప్రవాహము సూర్యునికి, అక్కడనుండి సూర్య మండలములోని అన్ని గ్రహాలకు చేరుతుంది. అందులో మన భూమి కూడా ఒకటి కనుక భూమికి కూడా చేరుతుంది. భూమితో పాటు మనకు కూడా చేరుతుంది. శక్తి మానవుని ప్రజ్ఞా కేంద్రాలపై పని చేస్తుంది. జీవుని పురోభి వృద్దికి దోహద పడుతుంది.

దీని ప్రభావము మనము గత కొన్ని సంవత్సరములుగా చూస్తునే వున్నాము. భూమిపై జరిగే అనేక మార్పులకు అదే కారణము. భౌగోళికముగా అనేక ఉత్పాతములు, భూకంపములు, రాజకీయ, ఆర్థిక సంక్షోభములు, యుద్దభయాలు మరియు సర్వత్రా అస్థిరత. Galactic Center నుండి మనకు చేరుతున్న శక్తి చాలా దివ్యమైనది, శక్తి వంతమైనది. ఇది మానవ జాతి పరిణామమునకు మరియు జీవుని ప్రజ్ఞా వికాసానికి దోహద పడుతుంది. హృదయ వికాసానికి, జ్ఞానాభి వృద్దికి దోహద పడుతుంది. చెడును తొలగించుకొని మంచిని పెంచుకొని తనను తాను మంచి మార్గములో మలచుకోటానికి శక్తి తరంగములు దోహద పడతాయి. శక్తి విశ్వాత్మకమైనది. దివ్యమైనది. పవిత్రమైనది.

ఒక్కసారిగా రాత్రికి రాత్రి ఎవరూ మారలేరు. మారాలని, మనసులోని రుగ్మతలను తొలగించుకొని జీవుడుగా వుద్దరింబడటానికి ప్రతిరోజూ కొంచెము కొంచెము ప్రయత్నము చేయాలి. ఇటువంటి సమయములో చేసేటటువంటి సాథన చాలా త్వరితముగా మంచి ఫలితాలను ఇస్తుంది. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరచుకోవాలి. భౌతిక వాదములో మగ్గి పోయిన మానవ జాతిని దైవత్వము వైపు నడిపించుటకు కావలసిన సమస్త మార్పులు భూమిపై జరుగుతాయి. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా సత్యము సత్యమే. దానినెవరు మార్చలేరు. మారుతున్న మార్పులకు భయపడక మనల్ని మనము సరిదిద్దుకుందాం.

ఒకసారి గాయత్రి మంత్రాన్ని పరిశీలిద్దాం....

భర్గో దేవస్య థీమహి థియో యో నః ప్రచోదయాత్

ఓమ్ భూర్భువస్సువః ఓమ్ తత్సవితు ర్వరేణ్యం

భూలోకము (భూః), భువర్లోకము (భువః) మరియు సువర్లోకము (సువః) లను వెలిగించు సవిత్రు అనే వెలుగు నన్ను ఆవహించి మా బుద్ది (థీః)ని ప్రచోదనము చేయవలెని భర్గో దేవుని ధ్యానించుచున్నాను. భర్గులు అనగా వెలుగులు. వెలుగులకు మూలము. మూలము నుండి వెలుగు సవిత్రుడు అందుకొని అక్కడనుండి మన సూర్యుడు అందుకొని మనకు ఇస్తున్నాడు. మన సూక్ష్మ దేహములో భర్గో దేవుని స్థానము సహస్రారము. సవిత్రుని స్థానము ఫాలభాగము. సూర్యుని స్థానము హృదయము. జీవుడు తన సాథన ద్వారా మూడింటిని క్రమబద్దీకరించుకుంటే అతడు దివ్య శరీరమును కలిగి అమరత్వము పొందుతాడు.

రాబోవు 2012 December 21st జరుగబోయే Galactice Center మరియు మన సూర్యుని సమాంతర క్రమబద్దీకరణ (alignment) గాయత్రి మంత్రములో చెప్పబడిన దానికి సరిపోలుతున్నట్లుగా వుంది. కనుక గాయత్రి మంత్ర ధ్యానము అత్యుత్తమము. ప్రతిరోజూ ఉదయ, సాయం సంథ్యలలో గాయత్రి ధ్యానము తప్పక మనిషికి వికాసమును కలిగిస్తుంది. ఇటువంటి కాలములో త్వరిత గతిన సాథన మరింత వేగవంతము అవటానికి చాలా అవకాశము కలదు. ప్రస్తుత జాతికి ఇది మంచి అవకాశము.

Galactic Center నుండి గ్రహించిన శక్తి వల్ల ఒక్కసారిగా సమస్త మార్పులు జరిగిపోవు. భూమి అంతా బద్దలైపోయి ప్రపంచము అంతా నాశనము అయిపోదు. భయపడ వలసిన పనిలేదు. కొన్ని సంవత్సరముల క్రిందటే ప్రక్షాళన మొదలైంది. పండగ వస్తోంది అని ముందుగానే ఎలా ఐతే పనులు ముందుగానే మొదలు పెడతామో రాబోవు మార్పులకు ప్రకృతి తన పని మొదలు పెట్టింది. ఎక్కడ ఎక్కడ మార్పులు అవసరమో అక్కడ తన శక్తులైన పంచభూతములతో శుభ్రము చేస్తూ వస్తోంది. నీరు, గాలి, అగ్ని మొగలగునవి కడుగుతూ వుంటే భూమి వాటికి సహకరిస్తోంది. గత కొన్ని సంవత్సరముగా జరుగుతున్నవి చూస్తే మనకు అవగతము అవుతుంది. అందుకున్న శక్తిని భూమి అంతటా స్థిర పరచటానికి కొన్ని సంవత్సరములు పడుతుంది. అప్పటి వరకు cleaning process జరుగుతునే వుంటుంది. అన్నిటి కంటే నీరు ఎక్కువగా పనికి పూనుకున్నట్లుగా కనపడుతోంది. కనుకనే జలప్రళయాలు ఎక్కువగా వస్తున్నాయ్. జపాన్ సునమీ మరియు అనేక చోట్ల వరదలు. అమెరికాలో సుడిగాలులు ఎన్నడూలేని విథంగా ఉగ్రరూపం దాల్చాయి. రాబోవు 3, 4 సంవత్సరముల వరకు ఇటువంటి మార్పులు జరుగుతూనే వుంటాయి.

ఇది సూర్యునికి మరియు భూమికి ఒక రకమైన initiation వంటిది. అన్ని సర్దుబాట్లు జరిగిన తరువాత ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. అహంకరించి, మదించి విర్రవీగుతున్న మానవ జాతికి తగిన గుణపాఠము చెప్పబడుతుంది. మేము చెప్పిందే వేదము, అందరూ మాకు అణిగి మణిగి వుండాలి అని ప్రపంచాన్ని శాసిస్తున్న మదాంధులకు దిమ్మతిరిగే కాలము ఇది. ఎవరైనా తలవంచక తప్పదు.

ఆస్తికులు, ఉన్నత భావాలు కలిగి అందరికి మంచిని పంచేవారు, దైవ మార్గములో నడిచే వారు తప్పక రక్షింప బడతారు. దీనులు కాపాడ బడతారు. కనుక భయపడ వలసిన పనిలేదు.

జరుగుతున్నది, జరుగబోయేది కూడా మంచికే అని గుర్తువుంచుకొని 2012 యుగాంతము కాదు కొత్త యుగానికి ఆరంభము అని భావించి అందరూ మంచి మార్గములో పది మందికి ఉపయోగ పడుతూ తమ జీవితములను సార్థక పరకుంటారని భావిస్తూ నేను నా గురువుల నుండి విన్నది, గ్రహించినది మీతో పంచుకుంటున్నాను. గ్రహించగలరు.