Tuesday, June 16, 2009

మాస్టర్ ఇ.కె సూక్తులు

  1. నిజమైన యోగ సాధకు డెప్పుడూ గంభీరతను కలిగి యుండడు.
  2. ప్రకృతియందు దోషముందని పిర్యాదు చేయుటకు అందేమియు లేదు. అది కాలమును వృధా చేయుటయే. అలా ఎప్పుడూ చేయకు. అన్యాయము అనునది ఏమీలేదు. అన్యాయము జరిగినది అని అరచుట పూర్తిగా నిరుపయోగము.
  3. 10 నిమిషములలో జ్ఞానవంతుడవవుటకు అవకాశమున్నపుడు దశాబ్దముల పాటు అజ్ఞానిగా వుండుటకు ఇష్టపడకు.
  4. నీవు సేవ చేస్తున్నావు అన్న విషయం మరచే వరకు సేవ చేస్తూ వుండు.
  5. కావలసినది మానసికమైన మౌనము, భౌతికమైన మౌనము కాదు.
  6. కుటుంబ స్త్రీలు పవిత్ర గ్రంధములు మాత్రమే చదువ వలెను (భగవద్గీత,భాగవతము మరియు రామాయణము వంటివి).
  7. దైవమును దేవాలయము ద్వారా దర్శించుము, దేవాలయము నందు కాదు.
  8. మనిషి కంటే ప్రకృతి మరియు పరిస్తితులు చాలా తెలివైనవి.
  9. ఇతరుల యెడల మన ప్రవర్తన, మన విద్యను నిర్ణయిస్తుంది.
  10. ఇతరుల దోషములను ఎంత చెప్పిన, అంత మార్పు మనయందు మాత్రమే జరుగవలిసి వున్నదని తెలుసుకొనుము.
  11. భయము అనునది జంతు ప్రవృత్తి.
  12. ఓటమిలో కూడా నిలిచి వుండేది సత్యం మాత్రమే.
  13. మనచుట్టూ వున్న పరిస్తితులన్నీ మన పూర్వకర్మ ఫలితములే అని ప్రతి ఒక్కరు తప్పక గ్రహించవలెను.
  14. నిరాడంబరత్వము మరియు ఋజుప్రవర్తన ఆనందమయ జీవనమునకు దోహదపడతాయి.
  15. గొప్పగా వుండటానికి ప్రయత్నించ వద్దు. మంచిగా వుండటానికి ప్రయత్నించు.
  16. డబ్బు అనేది ఇద్దరు మనుష్యులు జీవించటానికి వారి మధ్య కందెన (lubricant) వంటిది.
  17. సత్యము ప్రభువు వంటిది. అది ఎవరిని అనుసరించదు. దానిని అనుసరించ వలసినదే.
  18. నీ యొక్క కాంతి నీవే. దానిని నీ యొక్క హద్దులతో కాంతి విహీనము చేయకు.
  19. ఇతరుల కంటే గొప్పగా వుండటానికి ప్రత్నించకు. ఇతరుల కంటే గొప్ప పనులు చెయ్యటానికి ప్రయత్నించు.
  20. మనసు బాగోలేదు అని పని చెయ్యటం ఆపకు. పని చేస్తుంటే మనసు బాగవుతుంది. ఇదే కర్మ యోగ రహస్యం.