Thursday, July 16, 2009

స్వాగతమ్


మిత్రులందరికి నమస్కారము.

భగవంతుడు కరుణామయుడు. తన జీవులను ఉద్దరించి తరింపచేసి తనంత వారిగా చేయుటకు తనే అనేక రూపములలో అవతరించును. అట్టి రూపములలో గురుతత్వము పరమ ప్రేమ మరియు కరుణలతో కూడిన తత్వము. పరతత్వమే గురుతత్వము. శిష్యుని ఉద్దరించి అతడు దైవమును చేరుటకు కావలసిన సాధన అందించి శిష్యుని తనంత వానిగా చేయును.

అట్టి గురువు మనలో ఒకడై మనతో వుండి మనలను నడిపించును. అలా మనలను ఉద్దరించుటకు దిగివచ్చిన అవతారమే మాస్టరు సి.వి.వి. ఆయనచే ఎన్నుకొనబడి ఆయన వాహికలై గురు తత్వమును ప్రపంచ వ్యాప్తముగా విస్తరింప జేసినవారిలో ముఖ్యులు మాస్టరు యమ్.యన్ మరియు మాస్టరు ఇ.కె. వారు అందించిన వాటిలో కొన్ని నాకు చేతనైనంత వరకు తెలుగులో అందించుటకు చేస్తున్న ప్రయత్నమే నా ఈ బ్లాగు.

యోగాసక్తులకు ఇది ఉపయోగపడును గాక! మీ విమర్శలు స్వీకరించుటకు నేను సంసిద్దుడను.

ఇట్లు
మంగేష్