Wednesday, October 7, 2009

కర్మబంధము - మోక్షము


దైవముచే సృష్టింపబడిన మానవునికి బంధించకుండా ఎలా కర్మలు ఆచరించాలో తెలియపరుచబడినది. భగవద్గీతలో చెప్పబడిన కర్మ యోగమదియే. దానినే నిష్కామకర్మయోగము అని కూడా అంటారు. కాని స్వేశ్చ వుండుట వలన దానిని విస్మరించి తనకు నచ్చిన విథముగా ఆచరించుటవలన అతడు కర్మ బంధము నందుచిక్కుకొనుచున్నాడు. చేయుచున్న పని ఏదైననూ అది సంఘ శ్రేయస్సు కొరకు అని తెలిసి చేయువాడు దాని ఫలితములను ఆశింపక పొందుచున్నాడు. ఉద్యోగి జీతముకొరకు పనిచేయుట ఒక పద్దతి. అలా కాక నేను చేయునది పది మందికు ఉపయోగపడు పని, అందుకు నాకు జీతము ఇవ్వబడుతోంది అని భావించుట ఇంకొక పద్దతి.ఎలా చేసిననూ అది ఇంకొకరికి ఉపయోగపడునదే. కాని భావము నందు వ్యత్యాసమున్నది. అందువల్ల సుఖము లేక దుఃఖము కలుగుచున్నవి. ప్రపంచము నందుఎవరు పని చేసినా అది ఇంకొకరి కోసమే. తనకొరకు అనుకొనుట భ్రమ. వ్యాపారము చేసినా, ఉద్యోగము చేసినా అది ఇంకొకరికి ఉపయోగపడునదే. పని చేయుటవలన చేసిన వాడిని లాభముగా కాని, జీతముగా కాని పారితోషికము ముట్టుచున్నది. దాన్ని తిరిగి తన అవసరముల కొరకు ఇంకొకరికి చెల్లించవలసినదే కదా! చివరికిమిగిలేది ఏమిటి? లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఇది స్వార్థము వున్నవాడికైనా, స్వార్థము లేనివాడికైనా ఒక్కటే. అంతా యజ్ఞార్థ జీవనమే. కానీ తనకొరకు పనిచేయువాడు చిక్కుకొనుచున్నాడు. ప్రకృతి అలా పనిచేస్తూ మానవుని చేత కూడా పని చేయిస్తున్నది. కనుక యజ్ఞార్థ జీవనము వల్ల కర్మ బంధము తొలగుతుంది.

చేసిన ప్రతి పనికి కూడా దాని ఉద్దేశ్య ప్రకారము ఫలితము అందింపబడుతుంది. దాని వల్ల జీవునికి fate ఏర్పడుతుంది. ఇతరులను వంచించిన వాడు వంచింపబడతాడు.అన్నీ కూడా అంతే. ప్రకృతి నియమములే అలాంటివి. మనకు అందింపబడినది ఇతరులకు అందివ్వటానికే. దాచుకుందాం అనుకొనుటవలన అసలు ఇబ్బందులన్నీకూడా. అందువల్ల బంధము పెరుగుతుంది. దాచుకున్నది పోతున్నదేమో అని భయం వేస్తుంది దానివల్ల దుఃఖము కలుగుతుంది. ఇతరులకు పంచటము వల్లఆనందము కలుగుతుంది. బంధము తొలగుతుంది. కనుకనే దానమును ఏర్పాటు చేసినారు. యజ్ఞజీవనము తరువాత బంధములు తొలగించునది దానమే. వీటివల్లతిరిగి కర్మ బంధము ఏర్పడుట జరగదు.

అలా అనేక జన్మలతో పేరుకు పోయిన కర్మ అంతా ఒక్క జన్మకే ఇచ్చినచో బ్రతికు వుండుట అసాధ్యము. దాన్ని సంచిత కర్మ అంటారు. అంటే అజ్ఞానముతో పేర్చుకున్నకర్మ అని. జీవుడు దాన్ని తప్పక అనుభవించవలెను. అంతా ఒక్కసారి కష్టము కనుక దానిలోని కొంత కొంత భాగము ఒక్కొక జన్మ యందు ఇవ్వబడుతుంది. దాన్నిప్రారబ్దము అంటారు. అంటే ప్రస్తుత జన్మయందు ఇవ్వబడిన కర్మ. మిగిలినది రాబోవు జన్మలకు దాచి వుంచబడుతుంది. జన్మయందు ఇవ్వబడిన కర్మనుఅనుభవించి తిరిగి కొత్త వాటిని కనుక తయారుచేసుకొనక పోతే ప్రారబ్దము తొలగుతుంది. కర్మ నిర్వహణ తెలియకపోతే ఒక కర్మ నుండి ఇంకొకదానిని పుట్టించుట చాలాసులభము. Motive is important behind every Action. ప్రతిపని యందు కూడా అది చేయు వుద్దేశ్యమును గమనించుకోవాలి. అందులో తేడా పడితే దానినిసరిచేసుకోవాలి. ప్రారబ్దమును అనుభవించాలంటే ఒక్కటే మార్గము. అది వచ్చినప్పుడు దానిని అంగీకరించి వుండటమే. ఎవరిమీదా ఫిర్యాదు చేయకూడదు. కారణముఇంకొకరు అని నిందించకూడదు. జరుగుచున్న వాటికి కారణము ఇతరులనుకొనుట సర్వసాధారణము. మనకు జరిగినదానికి ఏదైనా కారణము ఇతరులు కారు. కారణముమనయందే వుంటుంది. ఇతరులను నిందించుటవలన మనకు తృప్తి కలగవచ్చు, కానీ దోషము మనయందే వుంటుంది. ఎవరికి వారు చాలా శుద్దముగా మంచివారుగాకనపడతారు. పరిస్థితులు ఎలాంటివైనా, మనకి నచ్చినా, నచ్చక పోయినా వాటిని అంగీకరించి వుండట ఒక్కటే మార్గము. దీనినే Law of Acceptance అంటారు.వచ్చినదానిని అంగీకరించి తలవంచి తనవంతు కర్తవ్యమును నిర్వర్తించుట ఒక్కటే మార్గము. అలాకాక కారణము ఇతరుల యందు వున్నదనుకొని వారిని నిందించుటవలన మరల కొత్త కర్మను సృష్టించుకొనినవారము అవుతాము. కర్మ సిద్దాంతము (Doctrine of Action) తప్పక తెలియవలెను. ఇది తెలియక ఎన్ని పూజలుచేసినా, ఎన్ని వ్రతములు చేనినా, ఎన్ని యజ్ఞాలు చేసినా అది గజ స్నానము వలే ఎప్పుడూ మురికితో కూడి వుంటుంది. ఒకవైపు కర్మ నివృత్తి కొరకు దైవ ప్రార్థనలుచేస్తూ, జరుగుతున్న పరిస్థుతులకు ఇతరులను నిందిస్తూ ఎదుగుదల లేకుండా వుంటాము. కనుక ఎంతో జాగ్రత్తతో అప్రమత్తులమై కర్మలను ఆచరించాలి. మన పూర్వకర్మయే ప్రస్తుత పరిస్థుతలవలే మన ముందుకు వస్తున్నదని గుర్తించవలెను. మనదే మనకు వస్తుంది. ఒకరిది ఇంకొకరికి రాదు. ఇది బాగా గుర్తువుంచుకోవాలి. దానినిఎంతో శ్రద్దతో, సహనముతో నిర్వహించాలి.

మనకు వచ్చే ప్రతి రోగముకాని, జబ్బు కాని అది మన ఆహార, విహారముల యందు మనము నిర్వర్తించినదానిని అనుసరించియే. థనమైనా, కుటుంబమైనా.. ఎవైనాకూడా అంతే. "ఎవరు చేసినదానికి వారే అనుభవించాలి" అంటే అదే మరి. ప్రకృతి వల్ల ఏర్పడిన వైపరీత్యములు తప్ప మిగిలినవన్నీ కూడా ఎవరికి వారు చేసిన కర్మనుఅనుసరించియే వుండునని తప్పక గుర్తేరిగి వుండవలెను. కొన్నిసార్లు మన దోషము లేకయే నిందలు పడవలసి వుంటుంది. నష్టము రావచ్చు, భాధలు కలుగవచ్చు...ఎమైనా జరుగవచ్చు. అప్పుడు దైవమును తలచి ఎదురైన పరిస్థితిని అంగీకరించి వున్నచో కర్మ తొలగింపబడును. అందరిలో నన్ను చూడు అని దైవము చెప్పినదానికిఅర్థం అదే. వచ్చినవాడు దైవము.. నీ కర్మ తొలగించటానికే వేషములో వచ్చాడు అని తెలుసుకొని జీవించే వాడికి ప్రారబ్దము కరిగిపోతుంది. ఎవరి బాకీ వారేచెల్లించుకోవాలి. కర్మ కూడా అంతే. ప్రభుత్వము బాకీలు రద్దు చేసినట్లు కర్మను రద్దు చేసే విథానము ప్రకృతిలో లేదు. రద్దు వల్ల తిరిగి చేసే అవకాశము వుంది.అనుభవించినచో తిరిగి చేయుటకు ఆలోచించే అవకాశము కలదు. చేస్తే అనుభవించాలి, లేకపోతే లేదు. ఎప్పుడు ఎవరికి ఏది అందివ్వాలో అది కాలము అందిస్తుంది.

జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు మన ప్రతిస్పందన ఎలావుంటుందో దాని వల్ల కర్మ clear అయ్యిందా లేక కొత్త కర్మ ఏర్పడిందా అని నిర్దారింపబడుతుంది. దానినిక్రియామాన్ కర్మ అంటారు. దీనివల్ల కర్మ clear అవ్వవచ్చు లేదా కొత్తది ఏర్పడవచ్చు. కొత్తదానిని ఆగామి కర్మ అంటారు. నిందను అనుభవించవలసి వచ్చినప్పుడుదైవమునకు సమర్పించి మౌనము వహించుటయే ఉత్తమము. వాదనలోనికి దిగకూడదు. బుద్ది పూర్వకముగా అందు మన దోషములేదు అని తెలిసినప్పుడుసమాథానము చెప్పవలసిన పనికూడా లేదు. మనము ఇంకొకరికి నచ్చలేదు అంటే కారణము వారియందే వుంటుంది. మనకు నచ్చలేదు అంటే కారణము మనయందేవుంటుంది. అది కూడా నూతన కర్మకు కారణము అవుతుంది. మన ఆలోచనల వల్ల, భావముల వల్ల, ఆవేశముల వల్ల కూడా కర్మ ఏర్పడుతూ వుంటుంది. ఇదితొలగించుట చాలా కష్టము. దీనికి ఎంతో సహనము కావాలి. సాథకుడు తనవంతు సాథన తను చేస్తూ ప్రారబ్ద కర్మను తొలగించుకుంటూ ముందుకు వెళుతుంటే, ఇంకొకవైపునుండి దైవము లేక గురువు మార్గము ఏర్పరుస్తూ వుండగా ఇద్దరూ ఒకచోట కలవటానికి అవకాశము కలుగుతుంది. అదే హృదయము. మూలాధారము నుండిజీవుడు హృదయమువైపు ప్రయాణము చేయాలి, దైవము హృదయము వరకు దిగి వస్తాడు. అదే జీవుడు, ఈశ్వరుని సమాగమ స్థానము.

జీవితమును యజ్ఞార్థము (Service Oriented)గా మలచుకొని, జీవుల యందు స్నేహ భావము కలిగి, ప్రారబ్దమును అంగీకరిస్తూ, నూతన కర్మను కల్పించుకొనకదైవమునకు లేక గురువునకు సమర్పణచెంది జీవుంచు వానికి కర్మ తొలగింపబడి జీవుడు దేవుడై సమాజమునకు మార్గదర్శకత్వము వహించును. ప్రస్తుతకుంభయుగములో శద్దా, భక్తులు కలిగి సిద్ద పడిన వానికి కర్మ అత్యంత వేగముగా తొలగింప బడుటకు అవకాశము కలదు. అతడే మోక్షమును పొందును. బంధముతొలగుటయే మోక్షము. మోక్షమనునది ప్రత్యేకముగా లేదు. ఒక భక్తుడు భగవాన్ రమణ మహర్షిగారిని "స్వామీ, నాకు మోక్షము వస్తుందా" అని అడిగాడట. దానినిఆయన "రాదురా" అన్నారట. ఒకటి రెండు సార్లు అడిగినా ఆయన అదే అన్నారట. అప్పుడు భక్తుడు "నేను పాపాత్ముడను అందుకే నాకు మోక్షము రాదు అనిస్వామి అన్నారు" అని చాలా బాధ పడ్డాడట. అప్పుడు స్వామి "రావటానికి ఏమీ లేదురా.. బంధము తొలగితే ఉన్నది మోక్షమే" అన్నారట. కనుక మోక్షమును కోరుటకూడా కోరికే. కనుక కోరిక వున్నప్పుడు మోక్షము రాదు అని తెలియాలి.